పంచవటి ఆశ్రమాన్ని గురించి, మా భావజాలాన్ని గురించి, అసలైన హిందూమతాన్ని గురించి తెలుసుకోవడానికి ఒంగోలు చుట్టుప్రక్కల ఉన్నవారికి ఇది సువర్ణావకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.
15, ఆగస్టు 2025, శుక్రవారం
ఒంగోలు పుస్తక మహోత్సవం - 2025 లో మా స్టాల్
11, ఆగస్టు 2025, సోమవారం
మా 73 వ పుస్తకం 'పది శాక్తోపనిషత్తులు' విడుదల
10, ఆగస్టు 2025, ఆదివారం
'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణ విడుదల
మొదటి ముద్రణలో 1318 పద్యములున్నాయి. మూడవముద్రణలో 1731 పద్యములైనాయి. అంటే దాదాపు 400 పద్యములను అదనంగా వ్రాసి చేర్చడం జరిగింది. అంతేగాక, అదనపు అధ్యాయములను కూడా చేర్చడం జరిగింది.
ప్రస్తుతపు మూడవముద్రణలో చేర్చబడిన ముఖ్యాంశము మంత్రభాగపు వివరణ. మొదటి రెండు ముద్రణలలో మంత్రభాగాన్ని పెద్దగా స్పృశించలేదు. కారణం, మంత్రములను పుస్తకరూపంలో ఇవ్వడం ఎందుకని భావించడమే. కానీ, శ్రీవిద్యకు మంత్రమే ప్రాణం గనుక అది కూడా ఉండాలని కొందరు అభిమానులు పదే పదే చెప్పడంతో, దానిని ఈ ముద్రణలో వివరంగా చర్చించడం జరిగింది. అయితే, గురూపదేశం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పడం జరిగింది.
మంత్రములను పుస్తకముల నుండి గ్రహించవచ్చు. కానీ వాటియొక్క జపధ్యానవిధానములను (తంత్రమును) మాత్రం గురూపదేశపూర్వకంగానే నేర్చుకోవలసి ఉంటుంది.
2015 తరువాత ఈ పదేళ్లలో 70 పైగా పుస్తకములను నేను వ్రాసినప్పటికీ, మొట్టమొదటిసారిగా వ్రాసిన 'శ్రీవిద్యారహస్యం' మాత్రం నేటికీ పాఠకుల అభిమానగ్రంధంగా నిలిచి ఉన్నది. నా భావజాలాన్ని, మా సాధనామార్గాన్ని చదువరులకు స్పష్టం చేస్తూనే ఉన్నది.
ఈ మూడవముద్రణ సందర్భంగా నా శిష్యులకు, అభిమానులకు ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈ నెల 15 నుండి 24 వరకూ ఒంగోలులో జరుగబోతున్న పుస్తకమహోత్సవంలో 'పంచవటి స్టాల్' లో 'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణతో సహా మా పుస్తకాలన్నీ లభిస్తాయి.
ఇది మా ఆశ్రమానికి దగ్గరే కాబట్టి, పుస్తకప్రాంగణంలో నేను కూడా మీకు అప్పుడపుడు కనిపిస్తాను. పుస్తకప్రాంగణంలో కలుసుకుందాం.
12, మే 2025, సోమవారం
మా 72 వ పుస్తకం 'ఆత్మవిద్యా విలాసము' విడుదల
స్వామివారి గురించి ఇంతకుముందు వ్రాసిన 'శివయోగ దీపిక' పోస్టులో వివరించాను. ఆయన వ్రాసిన గ్రంధములలో ముఖ్యమైనది 'ఆత్మవిద్యా విలాసము'. ఇది 64 శ్లోకములతో కూడిన చిన్న పుస్తకమే. కానీ భావగాంభీర్యతలో చాలా గొప్పది. ఈ శ్లోకములకు అర్థమును వివరిస్తూ, ఆటవెలది, కందము, ఉత్పలమాల ఛందస్సులలో పద్యములుగా తెనిగించాను. ఈ పద్యములను కేవలం రెండు రోజులలో వ్రాశాను.
'సదాశివేంద్ర స్తవము' లో 45 శ్లోకములున్నాయి. చాలావరకు 'ఆత్మవిద్యావిలాసము'లో ఇవ్వబడిన భావములనే స్వీకరించి, సదాశివేంద్రులను స్తుతిస్తూ శృంగేరి జగద్గురువులు ఈ శ్లోకాలను రచించారు. కనుక మొదటి 64 శ్లోకములలో వాడబడిన ఛందస్సులను మళ్ళీ వాడటం ఎందుకనిపించింది. అందుకని, ఒక క్రొత్త ఒరవడిలో, 'వృషభగతి రగడ' అనే ఛందస్సులో ఈ 45 పద్యములను రచించాను. కొన్ని పద్యములు, దీనికి దగ్గరి ఛందమైన 'మత్తకోకిల' లో వచ్చినాయి.
రగడలలో 20 దాకా రకాలున్నాయి. ఇవి, లయ-తాళ ప్రధానమైన ఛందోరీతులు. 'సదాశివేంద్రస్తవము'లో నేను వ్రాసిన పద్యములు పూర్తిగా ఛందోబద్ధములుగా లేవు. ఏమంటే, యతిప్రాసల చట్రంలో ఇముడ్చబడినపుడు, భావవ్యక్తీకరణలో స్వేచ్ఛాసౌందర్యం కుంటుపడుతుంది. కనుక, లయకు నడకకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఈ పద్యములను వ్రాశాను. చదవడానికి, గుర్తుపెట్టుకోవడానికి, రాగబద్ధంగా పాడుకోవటానికి రగడలు దరువులు చాలా తేలికగా హాయిగా ఉంటాయి.
శృంగేరీ పీఠాధిపతులందరూ ఈ 'ఆత్మవిద్యావిలాసము' ను వేదంతో సమానంగా స్వీకరించారు. శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీస్వామి వారైతే, తన చివరిక్షణం వరకూ ఈ పుస్తకమును దగ్గర ఉంచుకుని, దీని శ్లోకములను వింటూ దేహత్యాగం చేశారు.
ఆత్మజ్ఞానియైన అవధూత యొక్క స్థితిని వివరించే గ్రంధం ఇది. ముముక్షువులైనవారికి ఈ గ్రంధము నిత్యపారాయణాగ్రంధం మాత్రమే కాదు, నిత్య ధ్యానగ్రంధం కావాలి.
అవధూతోపనిషత్ మరియు అవధూతగీతలలో ఉన్న భావజాలమే దీనిలో ఇంకొకవిధంగా చెప్పబడింది. అవధూతోపనిషత్ అనేది కృష్ణయజుర్వేదమునకు చెందిన సన్యాసోపనిషత్తు. అంటే, సన్యాససాంప్రదాయమును ఉగ్గడించే శ్లోకములను కలిగి ఉంటుంది. ఇటువంటివి నాలుగువేదములలో కలిపి 19 ఉపనిషత్తులున్నాయి. ఇవి లౌకికజీవితమును పూర్తిగా త్యజించి, ఆధ్యాత్మికజీవితాన్ని గడపడం పైన దృష్టిని ఉంచుతాయి. ఈ గ్రంథంలో చెప్పబడిన అవధూతస్థితి కూడా దీనినే వర్ణిస్తున్నది.
అవధూతస్థితిని గురించి అనుకోవాలంటే దత్తాత్రేయుల తరువాత సదాశివేంద్రులనే చెప్పుకోవాలి. ఈయన మన తెలుగువాడు మాత్రమే కాదు, మూడువందల ఏళ్ల క్రితం మనకు దగ్గరగా తమిళనాడులో నడయాడిన మహోన్నతుడు. మనమేమో ఇటువంటి మహనీయులను మర్చిపోయి, పీర్లను, ఫకీర్లను ఆరాధిస్తూ, దర్గాలలో తాయెత్తులు కట్టించుకుంటూ, మన మూలాలను మర్చిపోయి మతాలు మారిపోతూ, 'అందరూ దేవుళ్ళే కదండీ' అని నంగినంగి మాటలు మాట్లాడుకుంటూ, హిందూమతానికి ద్రోహులుగా, దరిద్రులుగా తయారై ఉన్నాము. ఇదీ మన పరిస్థితి !
యధావిధిగా ఈ గ్రంధమును వ్రాయడంలోనూ, విడుదల చేయడంలోనూ నాకు తోడునీడలుగా ఉన్న సరళాదేవి, అఖిల, లలిత, శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.
ప్రస్తుతానికి ఇది E Book గా ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.
జిజ్ఞాసువులకు, ముముక్షువులకు, తెలుగుపద్యముల అభిమానులకు ఈ గ్రంధం మహదానందాన్ని కలిగిస్తుందని నమ్ముతున్నాను.
2, మే 2025, శుక్రవారం
మా 71 వ పుస్తకం 'గీతా కంద మరందము' విడుదల
ఇప్పటివరకూ మా సంస్థనుండి వచ్చిన పుస్తకాలకూ దీనికీ భేదం ఉన్నది. ఇప్పటివరకూ వచ్చిన 70 పుస్తకాలు నేను వ్రాసినవి. వాటిలో కొన్నింటిని నా శిష్యులు ఇంగ్లీషు, హిందీ భాషలలోకి అనువాదాలు చేశారు. ఈ పుస్తకం మాత్రం నా శిష్యురాలైన శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి వ్రాసినది. మార్చి నెలలో మా ఆశ్రమంలో జరిగిన ఆధ్యాత్మికసమ్మేళనం సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది నేడు E-Book గా విడుదల అవుతున్నది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.
ఉత్తమగ్రంధాలను నేను వ్రాయడం కాదు, నా శిష్యులు కూడా వ్రాస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ పనికి శ్రీకారం చుట్టింది శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి. అయితే, నా శిష్యురాలైన తర్వాత ఈమె కవయిత్రి కాలేదు. ముందునుంచీ ఈమెలో రచనాశక్తి, కవిత్వశక్తి ఉన్నాయి. వీరి తాతముత్తాతలు, మేనమామలు అందరూ మంచి కవులే. వెంకటేశ్వరస్వామివారిపైన పద్యములను, శతకములను ఈమె రచించింది. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘానికి (న.ర.సం) ఉపాధ్యక్షురాలు. ప్రస్తుతం ఈ గ్రంధమును రచనచేసి, నాకు అంకితమిచ్చింది. ఇది ఈమె యొక్క నిష్కల్మషమైన మనస్సుకు, గురుభక్తికి నిదర్శనం.
అచ్చ తెలుగు కందపద్యముల నడకలో ఉన్న అందము, గీతాశ్లోకములలో ఉన్న భావగాంభీర్యతలు కలసి పాలలో తేనె కలిపినట్లుగా వీరి రచన వచ్చింది. తెలుగుపద్యముల అభిమానులకు, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు ఈ గ్రంధము అమృతతుల్యముగా ఉంటుందనడం అతిశయోక్తి కాబోదు.
వీరి ఇలవేల్పు అయిన వేంకటేశ్వరస్వామివారి కటాక్షం ఈమెపైన స్థిరంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను.
ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి.
భగవద్గీతకు సమగ్రమైన వ్యాఖ్యానమును వ్రాయడం నా ముందున్న లక్ష్యాలలో ఒకటి. దీనికి రెండు కారణాలున్నాయి.
ఒకటి - మహనీయులైనవారందరూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాశారు. అప్పుడుగాని వారి రచనావ్యాసంగానికి పరిపూర్ణత రాలేదు. గీతకు సమగ్రమైన వ్యాఖ్యానాన్ని మొట్టమొదటగా వ్రాసినది ఆదిశంకరులు. ఈ పనిని చేయడం ద్వారా, మహాభారతంలో దాగి ఉన్న ఈ అద్భుతమైన అమృతభాండాన్ని బయటకు తీసి, ఆ అమృతాన్ని లోకానికి పంచిపెట్టాడాయన. ఈ పనిని ఆయన 2500 ఏళ్ల క్రితం చేశారు.
అయితే, ఈనాటికీ మన హిందువులలో గీతను పూర్తిగా చదవనివారు కోట్లల్లో ఉన్నారు. ప్రపంచం నేడు గీతకు ఎంతో ఉన్నతమైన స్థానాన్నిస్తున్నది. విదేశీ విశ్వవిద్యాలయాలలో భగవద్గీతను బోధిస్తున్నారు. అన్ని మతగ్రంధాల కంటే దీనిలో అత్యంత ఉత్తమమైన భావాలున్నాయని ప్రపంచ మేధావులే ఒప్పుకుంటున్నారు. అయితే మనకు మాత్రం గీతలో ఏముందో తెలియదు. కనీసం ఒకటి రెండు శ్లోకాలు కూడా మనకు రావు. వచ్చినా అర్ధాలు తెలియవు. తెలిసినా ఆచరణలోకి రావు. ఇది మన హిందువులకు పట్టిన అనేక దరిద్రాలలో ఒకటి. దీనిని పోగొట్టాలంటే, గీతకు సమగ్రమైన నిస్పాక్షికమైన వ్యాఖ్యానాన్ని వ్రాయాలి. దానిని విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లాలి.
రెండు - వేదముల సారం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారం భగవద్గీత. కనుక, గీతకు సరియైన వ్యాఖ్యానాన్ని చేయగల్గితే అది వేదోపనిషత్తులను వ్యాఖ్యానించినట్లే అవుతుంది. ఇంతకంటే మానవజన్మకు సార్ధకత ఇంకేముంటుంది?
ఈ రెండు కారణాల వల్ల ఈ ఉత్తమలక్ష్యాన్ని నా ముందు ఉంచుకున్నాను.
ఇప్పటివరకూ వచ్చిన వ్యాఖ్యానకర్తలందరూ, వారివారి సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయా కోణాలలో మాత్రమే గీతను వ్యాఖ్యానించారు గాని, నిష్పక్షపాతంగా, ఉన్నదున్నట్లుగా గీతార్ధములను వ్రాయలేదు. కొద్దో గొప్పో చలం గారు ఆ పనిని చేశారు. కానీ ఆయనకు శాస్త్రపాండిత్యం లేదు. వేదాంత-యోగపరమైన సాధనలలో లోతుపాతులూ ఆయనకు తెలియవు.
బహుశా నా సంకల్పం 2026 లో సాకారం కావచ్చు. ఈలోపల నా శిష్యురాలు ఈ పనికి శ్రీకారం చుట్టింది. ఒక చిన్నపాటి గీతను పూర్తి చేసింది. త్వరలో రాబోతున్న నా గీతావ్యాఖ్యానానికి పల్లవి (prologue) లాంటిదిగా ఈ పుస్తకమును అనుకోవచ్చు.
కలకండను బస్తాడు తిననక్కరలేదు. ఒక చిన్నముక్కను తినినా తీపిగానే ఉంటుంది. అదేవిధంగా, అర్ధం చేసుకొని ఆచరించగలిగితే, మన జన్మలు ధన్యం కావడానికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలైనా చాలు. సంక్షిప్తగీత కూడా విక్షేపాలను అంతం చేసే నిక్షేపంలాంటి దైవమార్గంలోనే నడిపిస్తుంది, సరిగా అర్ధం చేసుకోగలిగితే.
యధావిధిగా, ఈ పుస్తకం కవర్ పేజీని అద్భుతంగా తయారుచేసిన ప్రవీణ్ కు, టైప్ సెట్టింగ్ మరియు ప్రూఫ్ రీడింగ్ పనులను చూచుకున్న అఖిలకు, పబ్లిషింగ్ ని చూచుకున్న శ్రీనివాస్ చావలికి ఆశీస్సులు. వీరంతా మా పంచవటి పబ్లికేషన్ టీమ్ రధసారధులు.
కవితారసికులు, గీతాశాస్త్రాధ్యయన తత్పరులు అయిన తెలుగుపాఠకులు ఈ గ్రంధమును ఇతోధికంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.
27, ఏప్రిల్ 2025, ఆదివారం
మా 70 వ పుస్తకం 'శివయోగ దీపిక' విడుదల
16-17 శతాబ్దముల మధ్యలో తమిళనాడులో జీవించిన శ్రీ సదాశివేంద్రసరస్వతీస్వామికే సదాశివయోగీంద్రుడనిన నామాంతరమున్నది. మహాయోగి మరియు బ్రహ్మజ్ఞానియైన ఈయన, శ్రీ పరమశివేంద్ర సరస్వతీస్వామి శిష్యుడు. ఈయన కంచి కామకోటి పీఠమునకు 58 వ ఆచార్యునిగా ఉన్నారు.
సదాశివయోగీంద్రులు వెలనాటి నియోగి బ్రాహ్మణకుటుంబంలో శ్రీవత్సస గోత్రంలో జన్మించారు. నేను కూడా అదే కావడం నా అదృష్టం. కనుక స్వామివారు మా పూర్వీకులేనని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. వెలనాడు అంటే కృష్ణా పెన్నా నదుల మధ్యప్రాంతం. ముఖ్యంగా గుంటూరు, రేపల్లె, నెల్లూరు ప్రాంతాలను ఆ కాలంలో వెలనాడు అనేవారు.
ముస్లిముల రాక్షసదండయాత్రలనుండి, వారు పెట్టిన హింసలు, అరాచకాలనుండి తప్పించుకోవడానికి, తమ ఆడవారిని తమ కుటుంబాలను కాపాడుకోవడానికి, ఆ కాలంలో అనేక తెలుగుకుటుంబాలు వారివారి ఆస్తిపాస్తులను వదలిపెట్టి, కట్టుబట్టలతో తమిళనాడులోని కుంభకోణం కోయంబత్తూరు మొదలైన ప్రాంతాలకు పారిపోయి అక్కడ క్రొత్తజీవితాన్ని మొదలుపెట్టాయి. అటువంటి కుటుంబాలలో వీరిది కూడా ఒకటి.
వీరి పూర్వనామధేయం శివరామకృష్ణశర్మ. పరమశివేంద్రులవారి వద్ద ఉపదేశమును పొంది, అనేక ఏళ్లపాటు కావేరీతీరంలో తపస్సు చేసిన తరువాత ఈయన బ్రహ్మజ్ఞానసిద్ధిని పొందారు. శాస్త్రాలలో ఎంతో ఉన్నతంగా కొనియాడబడిన అవధూతస్థితిని అందుకున్న అతికొద్దిమంది నవీనులలో ఈయనొకరు. వీరి సజీవసమాధి తమిళనాడులోని కరూర్ జిల్లాలో గల నేరూరు గ్రామంలో ఉన్నది.
సదాశివయోగీన్డ్రుల గురించిన అనేక మహిమలు మరియు గాధలు దక్షిణాదిలో ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరమహంస యోగానందగారు తన పుస్తకం Autobiography of a yogi లో పొందుపరచారు. అనేక భక్తికీర్తనలను, వేదాంతగ్రంథములను సదాశివ బ్రహ్మేంద్రస్వామి రచించారు. వాటిలో బ్రహ్మసూత్రములకు, యోగసూత్రములకు వ్రాసిన వ్యాఖ్యానములు పేరెన్నిక గన్నవి.
వీరి గ్రంధములలో ఒకటి - మంత్ర, లయ, హఠ, రాజ, భక్తి, జ్ఞానయోగముల మేలుకలయిక అయిన ఈ గ్రంథము. ఎన్నో యోగసాధనల సంకలనా సమాహారంగా ఈ గ్రంథం గోచరిస్తుంది. పంచవటి నుండి వెలువడుతున్న 70 వ గ్రంథముగా దీనిని పాఠకులకు అందిస్తున్నాము.
ఇటువంటి మహనీయుడు వ్రాసిన ఈ అద్భుతగ్రంధమును నా వ్యాఖ్యానంతో ఆయనయొక్క మాతృభాష అయిన తెలుగులోకి తేగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ పుస్తకమును వ్రాయడంలో నాకు అనుక్షణం చేదోడువాదోడుగా ఉన్న నా శ్రీమతి సరళాదేవికి, శిష్యులు అఖిల. లలిత, శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.
ప్రస్తుతం ఈ పుస్తకం E-Book గా అందుబాటులోకి వస్తున్నది. యధావిధిగా ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.
మా ఇతర గ్రంధములను ఆదరించినట్లే అద్భుతమైన ఈ గ్రంధాన్ని కూడా ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను.
23, ఏప్రిల్ 2025, బుధవారం
మా 69 వ పుస్తకం Indian Astro Numerology విడుదల
ఇది నా కలం నుండి వెలువడుతున్న 69 వ గ్రంధం. ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా విడుదల అవుతుంది.
పాశ్చాత్య సంఖ్యాశాస్త్రానికి భిన్నమైన మన భారతీయ సంఖ్యాశాస్త్రాన్ని నా పరిశోధనలో కనిపెట్టి 52 జాతకచక్రాల సహాయంతో సోదాహరణంగా ఈ గ్రంధంలో వివరించాను.
ఈ గ్రంధం తెలుగులో చాలా ప్రజాదరణను పొందింది. హైద్రాబాద్, విజయవాడ పుస్తకప్రదర్శనలలో ఎక్కువగా పాఠకులు తీసుకున్న గ్రంధాలలో ఇదీ ఒకటిగా నిలిచింది. ఈ పద్ధతి చాలా బాగుందని, జాతకాల విశ్లేషణలో బాగా ఉపయోగపడుతున్నదని చదువరుల నుండి నాకు మంచి రివ్యూలు కూడా వచ్చాయి.
అంతర్జాతీయ పాఠకుల ఉపయోగార్ధమై ప్రస్తుతం దీనిని ఇంగ్లీషులోకి అనువదించి విడుదల చేస్తున్నాము.
తెలుగు పుస్తకమును ఇంగ్లీషులోకి అనువాదం చేసిన నా శిష్యురాలు స్నేహలతారెడ్డికి ఆశీస్సులు తెలుపుతున్నాను.
ఇంగ్లీషు చదివేవారిలో దీనికి విస్తృత పబ్లిసిటీని కల్పించాలని Panchawati USA టీమ్ వారిని కోరుతున్నాను.
18, డిసెంబర్ 2024, బుధవారం
మా 68 వ పుస్తకం 'మహనీయుల జాతకాలు - జీవితవిశేషాలు' విడుదల
దీనిలో అతి ప్రాచీనకాలం నాటి అవతారపురుషుడైన శ్రీకృష్ణభగవానుని నుండి మొదలుపెట్టి, గౌతమబుద్ధుడు, మహావీరుడు, ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభువు, శ్రీరామకృష్ణ పరమహంస, శారదాదేవి, వివేకానందస్వామి, రమణమహర్షి, మెహర్ బాబా, పరమహంస యోగానంద, అరవిందయోగి, కంచి పరమాచార్య, ఆనందమయి మా, నీంకరోలి బాబా, జిల్లెళ్ళమూడి అమ్మగారు మొదలైన 18 మంది నిజమైన మహనీయుల జాతకాలు మరియు వారివారి జీవితవిశేషాలు సమగ్రంగా వివరించబడ్డాయి.
జాతకవిశ్లేషణలో నేను ఉపయోగించే అనేక జ్యోతిషరహస్యాలు, సూత్రాలను ఈ గ్రంధంలో ఆయాచోట్ల విపులంగా వివరించడం జరిగింది.
వెరసి, ఈ గ్రంధం జ్యోతిషవిద్యార్ధులకు, జ్యోతిషాభిమానులకు, జ్యోతిషాన్ని నేర్చుకునేవారికి, మన దేశపు అసలైన చరిత్రను, నా పుస్తకాలను మరియు భావజాలాన్ని ఇష్టపడేవారికి ఒక విందుభోజనం వంటిది అవుతుందని నమ్ముతున్నాను.
ప్రపంచ జ్యోతిషచరిత్రలో ఇటువంటి పరిశోధనాగ్రంధం ఇప్పటివరకూ లేదని, ఇకముందు రావడం కూడా కష్టమని సగర్వంగా చెబుతున్నాను. ఈ గ్రంధాన్ని చదవాలంటే మీకు అదృష్టం ఉండాలని చెప్పడం సాహసం కాదు, సమంజసమే.
ఇది అనేక ఏళ్ల పరిశోధనా ఫలితం. ఇది నాకొక Lifetime Achievement వంటిది. ఎన్నో వందల గంటలు కష్టపడి, ఎంతో ప్రాచీన చరిత్రను పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని వ్రాయడం జరిగింది.
దీని చిత్తుప్రతిని ఎన్నోసార్లు తిరగామరగా క్షుణ్ణంగా చదివి అనేకచోట్ల అవసరమైన సవరణలు సూచించడమే గాక, ప్రూఫ్ రీడింగ్ మరియు టైప్ సెట్టింగ్ చేసి దీనికొక రూపాన్నివ్వడానికి ఎంతో శ్రమించిన నా శిష్యురాలు అఖిల జంపాలకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను.
జ్యోతిషశాస్త్రంలో నాదైన విశ్లేషణా విధానాన్ని అతి చిన్నవయసులోనే ఎంతో పట్టుదలతో శ్రద్ధతో నేర్చుకుని, దానిలో మంచి ప్రజ్ఞను సాధించిన అతి కొద్దిమందిలో ఈమె ఒకరు. ఈ పుస్తకరచనలో నాతో కలసి పనిచేసే అదృష్టం ఈమెకు దక్కింది.
పుస్తకరచనలో నిరంతరం నాకు తోడునీడగా ఉన్న నా సహధర్మచారిణి సరళాదేవికి, ఫౌండేషన్ పనుల్లోనూ, ఆశ్రమ నిర్వహణకు చెందిన అన్ని విషయాలలోనూ ఆసరాగా నిలబడుతున్న మూర్తి మరియు సంధ్యలకు, కవర్ పేజీలను ఎంతో అందంగా డిజైన్ చేసి ఇచ్చిన ప్రవీణ్ కు, పబ్లిషింగ్ పనులలో సహాయపడిన శ్రీనివాస్ చావలి, గణేష్ మరియు శ్రీలలిత మొదలైన నా ఇతర శిష్యులందరికీ ఆశీస్సులు.
ఈ పుస్తకం దాదాపు 800 పేజీలుగా వచ్చింది కనుక రెండు భాగాలుగా దీనిని ముద్రించడం జరిగింది. దీని 'ఈ బుక్' వెంటనే అందుబాటులో వస్తుంది. ప్రింట్ పుస్తకం మాత్రం ఈనెల 19 నుండి మొదలౌతున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలోను, జనవరి 2 నుండి జరిగే విజయవాడ పుస్తక మహోత్సవంలోనూ, మా 'పంచవటి స్టాల్' లో మాత్రమే లభిస్తుంది. బుక్ ఫెయిర్ అయిపోయిన తర్వాత, పోస్ట్ ద్వారా యధావిధిగా ఇక్కడ లభిస్తుంది.
అంతర్జాతీయ పాఠకుల కోసం త్వరలో దీని ఇంగ్లీష్ అనువాదం కూడా విడుదల అవుతుంది.
ఔత్సాహికులైన పాఠకులు, జ్యోతిషశాస్త్ర విద్యార్థులు, చరిత్ర అభిమానులు, నా రచనల అభిమానులు, సనాతన ధర్మానుయాయులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.
24, ఆగస్టు 2024, శనివారం
మా 67 వ పుస్తకం 'భారతీయ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రము' విడుదల
వెస్టర్న్ న్యూమరాలజీ మీద మార్కెట్లో వేలాది పుస్తకాలున్నాయి. అవన్నీ తప్పుల తడికలేనని నేనంటాను. నేనిలా అనడానికి తర్కబద్ధమైన కారణాలున్నాయి.
అంకెలను ఏ బీ సీ డీ లతో పోల్చి మీ నేమ్ నంబర్ రాబట్టడం, లేదా మీ జననతేదీతో పోల్చి మీ డెస్టినీ నంబర్ రాబట్టడాలు సరియైన విధానాలు కావు. కారణం? ఇవన్నీ నిన్నగాక మొన్న మనం కృత్రిమంగా ఏర్పరచుకున్న గ్రెగోరియన్ కాలెండర్ ను అనుసరిస్తూ ఉంటాయి.
లౌకికమైన లావాదేవీలకు తప్ప మీ 'డేట్ ఆఫ్ బర్త్' కు ప్రకృతిపరంగా ఎటువంటి విలువా లేదు. అదే విధంగా, ప్రకృతికీ గ్రెగోరియన్ కాలెండర్ కూ ఎటువంటి సంబంధమూ లేదు. కాబట్టి దాని ఆధారంగా లెక్కించబడే వెస్టర్న్ న్యూమరాలజీకి తర్కబద్ధత లేదు. అది సత్యాన్ని ప్రతిబింబించదు. దీనికి పూర్తిగా విభిన్నమైనది మన భారతీయ సంఖ్యాశాస్త్రము. ఇది ప్రకృతిపైన, నవగ్రహాలపైన ఆధారపడినది. కనుక సత్యమైన ఫలితాలనిస్తుంది.
నా పరిశోధనలో వెలుగుచూచిన ఈ సులభమైన విధానాన్ని 52 మంది ప్రముఖుల జాతకాల సహాయంతో తేలికగా సోదాహరణంగా ఈ పుస్తకంలో వివరించాను.
ఈ విధానాన్ని అనుసరిస్తే, మీ జాతకాన్ని మీరే తేలికగా అర్ధం చేసుకోగలుగుతారు.
ఈ పుస్తకం వ్రాయడంలో నాకు సహాయపడిన నా శ్రీమతి సరళాదేవి, శిష్యులు అఖిల, లలిత, ప్రవీణ్, చావలి శ్రీనివాస్, మూర్తి, సంధ్యలకు నా ఆశీస్సులు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మా ఇతర పుస్తకాలలాగే ఈ పుస్తకం కూడా ఇక్కడ లభిస్తుంది.
చదివి చూడండి మీకే అర్ధమౌతుంది.
14, జులై 2024, ఆదివారం
మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదల
ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ నుండి హిందీలోకి చాలా త్వరగా అనువాదం చేసిన నా శిష్యురాలు పూజా బగాడియాకు కృతజ్ఞతలు మరియు ఆశీస్సులు తెలుపుతున్నాను. శుద్ధమైన, సరళమైన హిందీలోకి ఈ అనువాదం జరిగింది.
ప్రస్తుతం 'ఈ-బుక్' గా విడుదల అవున్నప్పటికీ, త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.
హిందీ అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.
19, మే 2024, ఆదివారం
మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది
24, డిసెంబర్ 2023, ఆదివారం
మా 62 వ పుస్తకం 'స్వర చింతామణి ' విడుదల
19, సెప్టెంబర్ 2023, మంగళవారం
మా క్రొత్త పుస్తకం 'శివ స్వరోదయ శాస్త్రము' విడుదల
స్వరశాస్త్రం పైన గ్రంధాన్ని వ్రాయమని చాలామంది నన్ను గతంలో కోరారు. ప్రస్తుతం కూడా కోరుతున్నారు. అందువల్ల నా కలం నుండి వెలువడుతున్న 61 వ గ్రంధంగా ఈ గ్రంధాన్ని విడుదల చేస్తున్నాను.
ఇది నా అభిమాన టాపిక్స్ లో ఒకటి. చాలా చిన్నవయసులో ఈ సబ్జెక్ట్ ను నేను అధ్యయనం చేయడం జరిగింది. అప్పటినుండి ఇది నా అభిమాన విషయాలలో ఒకటిగా మారింది. దానికి కారణాలున్నాయి.
మార్షల్ ఆర్ట్స్ కు, శ్వాస సాధనకు, ప్రాణనిగ్రహానికి ఉన్న సంబంధము, స్వరశాస్త్రం పైన నాకున్న అభిమానాన్ని పెంచింది. జ్యోతిష్యశాస్త్రానికి స్వరశాస్త్రానికి ఉన్న సంబంధం ఆ అభిమానాన్ని ఇంకా ఎక్కువ చేసింది. శ్వాస పైన అదుపు లేకుండా యోగసాధన లేదు. కనుక, యోగశాస్త్రంలో ఇది కోర్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు.
ఈ గ్రంధం తంత్రసాహిత్యానికి చెందినది. మధ్యయుగాలలో ఈ గ్రంధము రచింపబడినప్పటికీ, దీనిలోని భావనలు, అభ్యాసములు అంతకుముందు ఎన్నో వేలఏండ్ల క్రిందటివి.
మనదేశంలో ముస్లిం దురాక్రమణ దారులు జరిపిన రాక్షస విధ్వంసకాండలో ఇటువంటి ఎన్నో వేలాది గ్రంధాలు నాశనమైనాయి. కోట్లాదిమంది హిందువులు, వేలాదిమంది గురువులు చంపబడ్డారు. గురుకులాలు, ఆశ్రమాలు, లైబ్రరీలు గోరీలదొడ్లుగా మార్చబడ్డాయి. ఆ అరాచక రాక్షస చర్యలనుండి బ్రతికి బట్టగట్టిన అమూల్యములైన గ్రంధాలలో ఇదీ ఒకటి.
ఈ గ్రంధం ఈనాడు మనకు లభిస్తూ ఉండటం మన అదృష్టమని చెప్పుకోవాలి. ఇన్నేళ్లకు దీనికి వ్యాఖ్యానమును వ్రాయగలగడం నా సుకృతమని భావిస్తున్నాను.
ఈ గ్రంధంలో చెప్పబడిన కొన్ని విధానములు నా సుదీర్ఘ ఉద్యోగపర్వంలో నన్ను ఎంతో ఆదుకున్నాయి. అవినీతితో నిండి, అడుగడుగునా నక్కలు తోడేళ్ళ వంటి మనుషులున్న రైల్వేవ్యవస్థలో, కులపిచ్చితో, వ్యక్తిగత దురహంకారాలతో నన్ను హింసపెట్టి నా రికార్డ్ పాడుచేయాలని చూచిన పై అధికారులతో వ్యవహరించేటపుడు ఈ స్వరశాస్త్ర విధానములను ఉపయోగించి సత్ఫలితములను పొందాను.
అదేవిధంగా, చిన్నాపెద్దా అనారోగ్యములు కలిగినపుడు, కలుగబోతున్నపుడు, స్వరశాస్త్రమును ఉపయోగించి వాటిని తేలికగా నివారించుకోగలిగాను.
కనుక ఇది నిత్యజీవితంలో ఆచరణాత్మకంగా ఎంతో ఉపయోగపడే శాస్త్రమని నేను అనుభవపూర్వకంగా చెప్పగలను.
ఈ గ్రంథరచనలో నాకు చేదోడువాదోడుగా సహకరించిన నా శ్రీమతి సరళాదేవికి, శిష్యురాళ్ళు శ్రీలలిత, అఖిలలకు, శిష్యులు ప్రవీణ్, శ్రీనివాస చావలి లకు నా ఆశీస్సులు.
మా 'పంచవటి పబ్లికేషన్స్' నుండి వచ్చిన మిగిలిన గ్రంధములను ఆదరించినట్లే దీనిని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను.
త్వరలో మా ఆశ్రమంలో జరుగబోయే రిట్రీట్స్ లో ఈ స్వరశాస్త్రము యొక్క ప్రాక్టికల్ ఉపయోగాలను నా శిష్యులకు ఆచరణాత్మకంగా నేర్పించడం జరుగుతుంది.
8, జనవరి 2023, ఆదివారం
మూడవ అమెరికా యాత్ర - 80 (మా క్రొత్త పుస్తకం 'యోగబీజము' విడుదల)
అమెరికా వచ్చిన ఈ ఐదునెలల కాలంలో నేను వ్రాసిన తొమ్మిదవ గ్రంధం ఇది. చాలా అరుదైన సిద్ధయోగ గ్రంధములలో ఇదీ ఒకటి.
అద్భుతమైన మన సనాతనధర్మములో లక్షలాది గ్రంధములు తురకల దండయాత్రలలో ఘోరాతిఘోరంగా తగులబెట్టబడినాయి. నలందా బుద్ధవిహారం లోని లైబ్రరీ ఒక్కటే మూడునెలలపాటు తగలబడుతూనే ఉందంటే అందులో ఎన్ని లక్షలాది గ్రంధములు అగ్నికి ఆహుతయి పోయాయో, ఎంతటి తరతరాల రీసెర్చీ, విజ్ఞానసంపదా నాశనమై పోయిందో అర్ధం చేసుకోవచ్చు మన భారతదేశమునకు, హిందూమతమునకు తురకరాక్షసులు చేసిన హాని మాటలలో చెప్పగలిగేది కాదు. ఆ విధంగా నెలలతరబడి మంటలకు ఆహుతి కాగా మిగిలిన కొన్ని గ్రంధములే ప్రస్తుతం మనకు అమిత సంభ్రమాశ్చర్యములను కలిగిస్తున్నాయి. మనకే గాక, యూరోప్, అమెరికా మొదలైన ఇతరదేశస్థులు వీటిని చదివి వీటిలోని జ్ఞానసంపదకు బిత్తరపోతున్నారు. ఇంగ్లీష్ లోకి, ఇతర యూరోపియన్ భాషలలోకి వీటిని అనువాదం చేసుకుని అనుసరిస్తున్నారు. వీటిని ఆచరిస్తున్నారు. ఎంతోమందికి యోగాభ్యాసమును నేర్పుతున్నారు.
హిందూమతమును అనుసరించే అమెరికన్లు నేడు వేలాదిమంది ఉన్నారు. బైటకు చెప్పకపోయినా, అభిమానించేవారు లక్షలలో ఉన్నారు. యోగాను చేస్తున్నవారు కోట్లలో ఉన్నారు. అమెరికాలో ప్రతి ఇంటిలో యోగా చేస్తున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు. నేను చూచి, చాలా ఆశ్చర్యపోయాను. సరిగ్గా చెప్పాలంటే, మన ఇండియాలో కూడా ఇంతగా యోగాభ్యాసమును మనం చేయడం లేదు. వీళ్ళు చేస్తున్నారు.
నేడు అమెరికాలో, యూరప్ లో శివభక్తులు, కృష్ణభక్తులు, దేవీభక్తులు, యోగులు ఎంతో మంది ఉన్నారు. ఇది వారి అదృష్టం. ఇండియాలో హిందూమతం నుండి ఇతరమతాలలోకి ప్రతిరోజూ మారుతున్నారు. అది వారి దరిద్రం.
మామూలు యోగసాధనకు, సిద్ధయోగసాధనకు గల భేదములను ఈ గ్రంధము స్పష్టముగా వివరిస్తుంది. జ్ఞానికంటే యోగి ఉత్తముడని ఇది చెబుతుంది. భగవద్గీత 6 వ అధ్యాయము 46 వ శ్లోకం కూడా దీనినే చెప్పినది.
శ్లో || తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున || 6. 46 ||
'తపస్వులకంటే యోగి అధికుడు. జ్ఞానులకంటే యోగి అధికుడు. కర్మిష్ఠులకంటే యోగి అధికుడు. కనుక ఓ అర్జునా ! నీవు యోగివి కా !'
యధావిధిగా ఈ పుస్తకమును వ్రాయడంలో కూడా నాకు తోడునీడలుగా నిలిచిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.
మిగతా మా గ్రంధములలాగే ఇది కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది. చదవండి. హిందూమతం యొక్క మహత్తరమైన ప్రాచీనవిజ్ఞానమును అర్ధం చేసుకోండి.
1, జనవరి 2023, ఆదివారం
మూడవ అమెరికా యాత్ర - 76 (మా క్రొత్త పుస్తకం 'అధ్యాత్మోపనిషత్' విడుదల)
ఈరోజు జనవరి 1, 2023. వ్యావహారికంగా క్రొత్త సంవత్సరాన్ని ప్రపంచమంతా జరుపుకుంటున్నది. మనకు మాత్రం ఉగాదికే క్రొత్త సంవత్సరం వస్తుంది. కనుక ఇది మన పండుగకాదు.
కాకపోతే, ఈరోజు వైకుంఠ ఏకాదశి. పైగా, రామకృష్ణుల భక్తులలో ఒక సాంప్రదాయం ఉంది. ప్రతి ఏడాదీ జనవరి 1 నాడు వాళ్లంతా 'కల్పతరు దినోత్సవం' అని జరుపుకుంటారు. కారణమేమంటే, 1886 జనవరి 1 నాడు, శ్రీరామకృష్ణులు కల్పతరువుగా మారి, అడిగినవారికి అడిగినట్లుగా వరాలిచ్చారు. ఎవరు ఏది కోరుకుంటే అది ప్రసాదించారు. ఆధ్యాత్మికంగాని, లౌకికంగాని ఎవరు ఏది కోరుకుంటే అది వారికి ఆరోజున లభించింది. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ, ప్రతి జనవరి 1 వ తేదీన, కల్పతరు దినోత్సవంగా శ్రీరామకృష్ణుల భక్తులు జరుపుకుంటారు. అంతేతప్ప జనవరి 1 మన క్రొత్త సంవత్సరం కాదు.
ఈరోజున మేమంతా డెట్రాయిట్లో స్పిరిట్యువల్ రిట్రీట్ లో ఉన్నాము. నిన్న, నేడు రెండురోజులపాటు, పూర్తి ధ్యానసాధనతో కూడిన రిట్రీట్ ఇక్కడ జరుగుతున్నది.
గత వ్యావహారిక సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, క్రొత్త వ్యావహారిక సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, గత ఏడాది ఎక్కిన మెట్లపైన నిలబడి, ఇంకా పైమెట్లకు ఎక్కమని నా శిష్యులకు పిలుపునిస్తూ రెండురోజుల ధ్యానరిట్రీట్ ను అమెరికాలో జరుపుతున్నాను. నేను అమెరికా వచ్చిన ఈ ఐదునెలల కాలంలో జరిగిన అన్ని రిట్రీట్స్ లో ఏవైతే సాధనావిధానాలను, యోగరహస్యాలను నేర్పిస్తూ వచ్చానో, అవన్నీ ఒక్కసారి రివ్యూ చేయడమే గాక, మరికొన్ని క్రొత్త సాధనలను ఈ రిట్రీట్లో ఇక్కడి శిష్యులకు నేర్పించాను.
ఈ నెలలో నేను ఇండియా రాబోతున్నాను. ఆ తరువాత 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' లో క్రొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి. ఏవైతే జరుగుతాయని గత కొన్నేళ్లుగా నేను చెబుతున్నానో, అవి ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి గమనించండి. క్రొత్త సంవత్సరంలో మరిన్ని జరుగుతాయి. దానికిది శుభారంభం.
ఈ సందర్భంగా 'అధ్యాత్మోపనిషత్' కు నా వ్యాఖ్యానమును మా క్రొత్తపుస్తకంగా విడుదల చేస్తున్నాను. ఇది చిక్కటి అద్వైతవేదాంతమును చక్కగా సూటిగా ప్రబోధిస్తున్న ఉపనిషత్తు. చాలా ఉన్నతమైన గ్రంధం ఇది. దీనిని ఒక్కదాన్ని మీరు మీ జీవితంలో ఆచరించగలిగితే చాలు, జన్మ ధన్యం అవుతుంది.
ఈ పుస్తకం వ్రాయడంలో కూడా నాకు తోడునీడలుగా నిలిచిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.
మిగతా మా గ్రంధములలాగే ఇది కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది.
25, డిసెంబర్ 2022, ఆదివారం
మూడవ అమెరికా యాత్ర - 73 (మా క్రొత్త పుస్తకం 'Medical Astrology Part - 2' విడుదల)
మీకు గుర్తుండే ఉంటుంది. రెండేళ్ల క్రితం Medical Astrology Part-1 అనే పుస్తకం నా కలం నుండి విడుదలైంది. అందులో నూరు జాతకచక్రాలను విశ్లేషించి, జలుబు నుంచి ఎయిడ్స్ వరకూ ఉన్న వివిధరోగాలు ఎలా కలుగుతాయి? జాతకం ప్రకారం వాటిని ఎలా తెలుసుకోవచ్చు? ఏయే జాగ్రత్తలు తీసుకుని వాటిని ఎదుర్కోవచ్చు? మొదలైన విషయాలను అందులో వివరించాను. తరువాత అది 'వైద్యజ్యోతిష్యం మొదటి భాగం' అనే పేరుమీద తెలుగులో కూడా వచ్చింది. ఈ రెండు పుస్తకాలూ 'ఈ బుక్స్' గాను, ప్రింట్ బుక్స్ గా కూడా విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణను పొందాయి. పొందుతున్నాయి.
నేడు దీని రెండవభాగాన్ని అమెరికా నుండి విడుదల చేస్తున్నాను. ఇందులో మరొక నూరుజాతకాల విశ్లేషణను మీరు చూడవచ్చు. దీనిలో కూడా నూరురకాలైన మొండి రోగాల గురించి జ్యోతిష్యపరంగా ప్రాక్టికల్ గా వివరించాను.
ప్రస్తుతానికి ఇది 'ఈ బుక్' మాత్రమే అయినప్పటికీ, త్వరలో ప్రింట్ బుక్ గా కూడా వస్తుంది. తెలుగులోకి కూడా అనువాదం జరుగుతుంది.
ఈ రెండుపుస్తకాలు, జ్యోతిష్యవిద్యార్థులకు, పండితులకు కూడా టెక్స్ట్ బుక్స్ గా ఉపయోగపడతాయి. అటువంటి అద్భుతమైన రీసెర్చి వీటిలో ఉంది. ఈ రెండు వందల జాతకాలకు నేను చేసిన విశ్లేషణను బాగా అర్ధం చేసుకుంటే, జాతకంలోని రోగాలను, వాటికి కారణమైన జాతకుని గతకర్మను, వాటి పరిహారాలను సమస్తాన్నీ మీరు అర్ధం చేసుకోగలుగుతారు.'
జ్యోతిష్యప్రపంచంలో ఇటువంటి పుస్తకాలు ఇంతవరకు రాలేదని, ఇకముందు కూడా రాబోవని సగర్వంగా చెబుతున్నాను.
మహాసముద్రంలాంటి జ్యోతిష్యశాస్త్రాన్ని అర్ధం చేసుకోలేక, రకరకాల సిస్టమ్స్ ను కలగలిపి, చివరికి ఏదీ పూర్తిగా అర్ధంకాక, గందరగోళానికి లోనౌతున్న నేటి జ్యోతిష్యపండితులకు, విద్యార్థులకు, అభిమానులకు, స్పష్టమైన దిశానిర్దేశాన్ని ఈ పుస్తకాలద్వారా చేస్తున్నాను.
అద్భుతమైన భారతీయ జ్యోతిష్యశాస్త్రానికి స్పష్టతను తేవడానికి నేను చేస్తున్న కృషిలో భాగంగా ఈ గ్రంధములు విడుదల చేస్తున్నాను. ఇవి ఊకదంపుడు అనువాదాలు కావని, రీసెర్చి గ్రంధాలని గమనించండి.
అంతేకాదు, ముందుముందు రాబోతున్న నా జ్యోతిష్య పరిశోధనా గ్రంధాలలో - వివాహ సమస్యలు, విద్యాసమస్యలు, సంతానసమస్యలు, ఉద్యోగసమస్యలు, ఆధ్యాత్మిక జాతకాలు, ఈ విధంగా వందలాది జాతకాలను ప్రాక్టికల్ గా విశ్లేషిస్తూ ఇంకా మరిన్ని పుస్తకాలను విడుదల చేయబోతున్నాను.
ఋషిప్రోక్తము, వేదాంగమైన జ్యోతిష్యశాస్త్రానికి పట్టిన కలిపీడను వదిలించి, దానికి స్పష్టతను కలిగించి, లోకానికి దాని ఘనతను ప్రాక్టికల్ గా అర్ధమయ్యేలా చేయడమే, 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ద్వారా సనాతనధర్మానికి నేను చేస్తున్న అనేక సేవలలో ఒక సేవ.
ఈ పుస్తకం వ్రాయడంలో కూడా నాకు తోడునీడలుగా నిలిచిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.
ఈ పుస్తకం కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది.
జ్యోతిష్యశాస్త్ర అభిమానులకు ఈ గ్రంధం ఒక విందుభోజనం వంటిది. ఆదరిస్తారని భావిస్తున్నాం.
3, డిసెంబర్ 2022, శనివారం
మూడవ అమెరికా యాత్ర - 64 (మా క్రొత్త పుస్తకం 'ఉత్తర గీత' విడుదల)
భగవద్గీతకు అనుచరులుగా ఉండే కృష్ణగీతలు రెండు మనకున్నాయి. ఒకటి అనుగీత, రెండు ఉత్తరగీత. ఈ రెండూకూడా శ్రీకృష్ణుని చేత అర్జునునకు బోధింపబడినవే.
నేపధ్యమేమో, మహాభారతయుద్ధం తదుపరి హస్తినాపురంలో రాజభవనప్రాంగణం. యుద్ధభూమిలో తనకు చెప్పిన విషయములను మరచిపోయానని, మళ్ళీ చెప్పమని అడిగిన అర్జునునకు శ్రీకృష్ణుడు ఓపికగా మళ్ళీ బోధించినవే ఈ రెండు గ్రంధములలోని విషయములు.
భగవద్గీతలో సూచనాప్రాయముగా చెప్పబడిన కొన్ని విషయములు వీటిలో విస్తారముగా వివరింప బడతాయి. వీటిలో ప్రస్తుతం ఉత్తరగీతకు నా వ్యాఖ్యానమును ఇప్పుడు విడుదల చేస్తున్నాను. దీనిలో యోగసాధనా క్రమం మిక్కిలి వివరముగా చెప్పబడింది.
కాలక్రమంలో అనుగీతకూడా మా ప్రచురణగా వస్తుంది.
ఈ పుస్తకమును ఇల్లినాయ్ రాష్ట్రంలోని షాంపేన్ సిటీలో ఉన్నపుడు ఎక్కువగా వ్రాశాను. కానీ మిషిగన్ రాష్ట్రంలోని ట్రాయ్ సిటీ నుండి పూర్తిచేసి విడుదల చేస్తున్నాను.
నేటి సోకాల్డ్ మేధావులకు వచ్చే అనేక సందేహాలు అర్జునునకు కూడా అప్పటిలోనే వచ్చాయి. ఎంతైనా మహారాజు కదా మరి! వాటికి శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానములు ఈ గ్రంధంలో చెప్పబడినాయి. ఆ సమాధానములలో, వేదాంతము, జ్ఞానము, యోగము, తంత్రశాస్త్రములు వివరింపబడినాయి. జీవన్ముక్తి, విదేహముక్తులు లక్ష్యములుగా చెప్పబడినాయి.
ఈ పుస్తకమును వ్రాయడంలో అనుకూలమైన వాతావరణమును కల్పించి, సహకరించిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు ప్రవీణ్, చావలి శ్రీనివాస్ లు, షాంపేన్ లో మమ్మల్ని ఎంతో ఆప్యాయతతో ఆదరించిన శ్రీనివాస్ నూకల, శకుంతలగార్లకు, డెట్రాయిట్ వాసులైన ఆనంద్ కుమార్, సుమతిలకు నా కృతజ్ఞతలు మరియు ఆశీస్సులను అందిస్తున్నాను.
డెట్రాయిట్ లో నా శిష్యులైన సాయి దంపతుల చేతులమీదుగా ఈ గ్రంధం విడుదల అవుతున్నది.
మా అన్ని గ్రంథముల లాగే, ఈ ఒక్క గ్రంధమును మీ జీవితానికి దిక్సూచిగా పెట్టుకుంటే చాలు, మీ జీవితం ధన్యమౌతుంది.
అసలైన హిందూమతమంటే ఏమిటో చదవండి. అర్ధం చేసుకోండి, ఆచరించండి. మానవజీవితాన్ని ఎంతో ఉన్నతంగా మార్చే అసలైన ఫిలాసఫీ మొత్తం ఈ గ్రంధంలో సంక్షిప్తంగా చెప్పబడింది.
మా గ్రంధాలన్నీ ఒక్క హిందువుల కోసమే కాదు, మొత్తం మానవజాతికి ఇవి ఎంతో పనికివచ్చే గ్రంధములు. ప్రపంచంలోని ఏ మతగ్రంధంలోనూ ఇటువంటి ఉన్నతమైన ఫిలాసఫీ మీకు ఎక్కడా దొరకదు. అలాంటివి మన అమూల్యగ్రంధములు. ఇవి మనిషికి మానవత్వాన్ని నేర్పడమే కాదు, దైవత్వంతో నింపుతాయి.
యధావిధిగా ఈ గ్రంధం కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది. మా మిగతా పుస్తకాల వలె దీనిని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాం.